అదేమిటో గానీ, డబ్బింగ్ సినిమా పాటలంటే అదోలా వుండాలని డిసైడ్ అయిపోయినట్టున్నారు మన వాళ్ళు . ముఖ్యంగా పాటల రచయితలు . కొంతకాలం ఏమీ రాని రత్నం అనే ఆయన చాలా మంచిట్యూన్‌స్ కి తన తెలుగుతో తెగులు పుట్టించేవాడు.పేడ పురుగుల్లా బురదలో దొల్లేద్దామో, మరేదో అని ఇష్టం వచ్చినట్టుండేవి చరణాలు . ఏమి చేస్తాం మన ఖర్మ అనుకొనేవాళ్ళం. దానికి కొనసాగింపుగా ఇప్పుడు నేషనల్ అవార్డ్ విజేతగారు యంత్రుడా ఓ యంత్రుడా అని రోబో చిత్రం లో గీకి పారేస్తే ఏమి చెయ్యాలో తెలీక ఈ పోస్ట్ లో పబ్లిగ్గా బాధపడుతున్నా. అసలు మహకవి శ్రీశ్రీ గారు వ్రాసిన నేను సైతం కి ఏదో నాలుగు ముక్కలు కలిపిన ఈయనకి అవార్డ్ ఇవ్వడమేమిటొ ?అవార్డ్ పానెల్ లో వున్న శంకరుడి మహత్యం వల్ల వచ్చిందంటారు. దాని మహిమ వల్ల ఏ టివి ప్రోగ్రాం చూసినా ఈయన జడ్జిగా మనని జడిపించేస్తున్నాడు.
ఏదో ఆయన ఖర్మ ఆయనది అనుకున్నా, నా బాధల్లా అసలు యంత్రుడు అంటే ఎవడు? అది అసలు తెలుగు పదమేనా? యంత్రానికి ,నాకు తెలిసి లింగాలుండవు.
ఇటువంటిదే మరొక్కటి ..అదేదో సినిమాలో డబ్బింగ్ రచయిత తన పైత్యం కలిపి మగధీరా అనే పదం సృష్టించి మనపై పడేశాడు. ఆదే పేరుతో రాజమౌళి ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశాడు. ఆయన తండ్రి గారు రచయిత కూడాను. అసలు విషయమేమిటంటే ధీర అంటే స్త్రీ. మగధీర అంటే? నావరకు నిజంగా ఆ హీరో మగధీర లాగే వుంటాడు. నిజంగా కావలంటే ఆ సినిమా కి మగధీరుడు అని టైటిల్ వుండడం కరక్ట్.ఏమి చేస్తాం !!!!!
జనగొణమన
రోజువారీ విశేషాలని మరోకోణంలో చూసే ప్రయత్నం
Wednesday, September 1, 2010
Thursday, August 19, 2010
అమెరికా వ్రతాలు-మొగుళ్ళ కష్టాలు
అమెరికాలొ వ్రతాలు చెయ్యలంటే చాలా కష్టం.ముఖ్యంగా మొగుళ్ళకి. అదేంటి ..వ్రతాలు ఆడవాళ్ళు కదా చేస్తారు? మరి మొగవాళ్ళకి కష్టాలేంటంటారా? అయితే చదవండి
కొంచెం సినిమా కథలా రివర్స్ ట్రాక్ లో వె్ళ్దాం.
రాత్రి పది కావొస్తోంది..మర్యాదరామన్న పైరేటెడ్ డీవీడీ నన్ను చూడవా అంటూ ఒకటే పోరు పెడ్తున్నా, పాపం అయిదు రకాల పళ్ళలో రెండు రకాలు దొరకలేదు, వరలక్ష్మి అమ్మవారికి కోపం రాదు గదా అని నా భార్యామణి తెగ గొణిగేస్తోంది.తప్పుతుందా అనుకుంటూ నేను సాధించుకొస్తా అని వాల్ మార్ట్ లోకి అడుగుపెట్టా.చూ్ద్దునా.అరటిపళ్ళు లేవు .ఎప్పుడూ ఇటుకేసి కూడా కొంచెం లుక్ వెయ్యి నాయనా అని ప్రేమగా చూసే ఆ రాక్ ఈ రోజు నీకు మంచి పని అయింది అన్నట్టుగావెక్కిరించింది
సరేలే..నువ్వు కాకపోతే నీ బాబు లాంటి పండు తీసుకొంటా అనుకుంటూ కదిలా.ఇంతలో నా భార్యామణి సినిమాల్లో ఫ్లాష్ కారక్టర్ లా ప్రత్యక్షమయ్యి," ఇదిగో, ఆల్రెడీ ఆపిల్స్, ఆరంజెస్ , గ్రేప్స్ తీసేసుకున్నా.అవి తప్ప ఇంకేమైనా పట్టుకురండి" అని చెప్పి మాయమయింది. సరేలే.అనుకుంటూ ఇంకా ఏమి ఫ్రూట్స్ వుంటాయి అనుకుంటూ చూసుకొంటూ వె్ళ్తున్నా. కొంచెం దూరంగా, ఇద్దరు ఇండియన్‌స్ వాదులాడుకుంటున్నారు. ఒక చెవెరిక్కించా, బాడ్ మానర్స్ అంటే ఇది కాదులే అనుకుంటూ. అక్కడ ఒకటే స్ట్రాబెర్రీ డబ్బా వుండడం. నేను ముందు తీసుకున్నా అంటే నేను ముందు అనుకుంటూ కీచులాడుకుంటున్నారు.ఓహో ఏమీ వ్రత మహత్యం అనుకుంటూ ముందుకు సాగా. ఇంతలో ఎదురుగా ఒక దేశీ దేబిరిగొట్టు శాల్తీ ప్రత్యక్షమయ్యింది ' మిమ్మల్నేక్కడో చూశా ఇంతకు ముందు అనుకుంటూ'. దొరికానురా భగవంతుడా! మర్యాదగా మర్యాద రామన్న చూడకుండా వీది అమర్యాదకి నేను బలి అవ్వాలా? అవ్వను..అవ్వను గాక అవ్వను అని నొక్కి నాకు నేనే వక్కానించుకొని (మొన్ననే కొన్న క్రేన్ వక్కపొడితో), " నన్నా! అవును ఏమ్వే మీట్ లో..కొత్త మెంబర్ని " అని చెప్పి అమర్యాదగానే దాటుకుని వచ్చేశా్. ముందున ఒక తెలుగు బట్టతలాయన ప్రత్యక్షమయ్యాడు "మాస్టారూ..ఇంతకీ వరలక్ష్మీ వ్రతానికి బ్లూ బెర్రీస్ పనికివొస్తాయంటారా " అని అడుగుతూ. నాకు నేనే శ్రీ్క్రిష్ణునిలా ఫీల్ అయిపోతూ,"మాస్టారూ దేవుడే ఇదంతా సృష్టించాడు,అందులో మనకు తోచిందేదో మనం ఇస్తున్నామంతే" అనిచెప్పి కన్విన్‌స్ చేశా. దాని మహత్యమేమోగానీ, ఆ బట్టతల ఆబగా బ్లూ బెర్రీస్ , బ్లాక్ బెర్రీస్ , రెడ్ బెర్రీస్ , గ్రీన్ బెర్రీస్ కూడా(ఇవన్నీ వుంటాయా అని నాకు కూడా అనుమానమే). తీసుకున్నాడు.నేను కూడా ఒక పాకెట్ బ్లూ బెర్రీస్ తీసుకొన్నా. ఇక ఇద్దరకీ ఇంకొక పండు కావాల్సి వచ్చింది. ఎదురుగా ఒక చెర్రీస్ పాకెట్ కనపడింది. "అదేంటొ ఇవ్వాళ అంద్రుల పుణ్యమా అని వాల్ మార్ట్ వాడి స్టాక్ పెరగబోతొంది " మనసులోఅనబోయి బయటకే అనేశా. బట్టతల పక్కనే వున్నట్టు చూడలేదు." అవును మస్టారు. ఒక్కటె చెర్రీస్ వున్నట్టువుంది ?" అంటూ అంద్రుల ట్రేడ్ మార్క్ నవ్వుతో. ఎంతటి అంధ్రా వాడినైనా, ఇంతవరకు నాకు అర్థం కానిది ఆ నవ్వు ఒక్కటే మనవారిలో. ముఖ్యంగా వాళ్ళకి దక్కంది మనకి దక్కినప్పుడు. అయినా కొంచెం పెద్ద మనసు చేసుకున్నా." మీకభ్యతరం లేకపోతే 50-50 చేసుకుందాం. నాకు డబ్బులేమీ ఇవ్వనవసరం లేదు" అన్నా. "లేదు లెండి నాకు చాలవు" అన్నాడు . ఆ మాటలో ఎటువంటి ఫీలింగ్ లేకపోవడం ఆశ్హర్యం వేసింది. అవునండీ..మా ఆవిడ 5 రకాలు , రకానికి 32 చొప్పున పళ్ళు కావాలంది.అందుకే అన్నాడు.చుట్టూ చూసా..ఇంక నాకు పళ్ళు కనపడలేదు. ఇటు తిరిగేసరికి , బట్టతల లేడు. ఏమయ్యిందో అనుకుంటూ కౌంటర్ దగ్గరికి నడిచా. పెద్ద క్యూ వుండడంతో కొంచెం వెయిట్ చేయాల్సి వొచ్చింది. నాటర్న్‌అయ్యాకా, ఒక సారి వెనక్కి తిరిగి చూస్తే, బట్టతల 32 వాటర్ మెలన్‌స్ ట్రాలీ లో తొసుకుంటూ.. ఈ వ్రతాభిషేకానికి ప్రస్తుతం కామా....

Subscribe to:
Comments (Atom)