అదేమిటో గానీ, డబ్బింగ్ సినిమా పాటలంటే అదోలా వుండాలని డిసైడ్ అయిపోయినట్టున్నారు మన వాళ్ళు . ముఖ్యంగా పాటల రచయితలు . కొంతకాలం ఏమీ రాని రత్నం అనే ఆయన చాలా మంచిట్యూన్‌స్ కి తన తెలుగుతో తెగులు పుట్టించేవాడు.పేడ పురుగుల్లా బురదలో దొల్లేద్దామో, మరేదో అని ఇష్టం వచ్చినట్టుండేవి చరణాలు . ఏమి చేస్తాం మన ఖర్మ అనుకొనేవాళ్ళం. దానికి కొనసాగింపుగా ఇప్పుడు నేషనల్ అవార్డ్ విజేతగారు యంత్రుడా ఓ యంత్రుడా అని రోబో చిత్రం లో గీకి పారేస్తే ఏమి చెయ్యాలో తెలీక ఈ పోస్ట్ లో పబ్లిగ్గా బాధపడుతున్నా. అసలు మహకవి శ్రీశ్రీ గారు వ్రాసిన నేను సైతం కి ఏదో నాలుగు ముక్కలు కలిపిన ఈయనకి అవార్డ్ ఇవ్వడమేమిటొ ?అవార్డ్ పానెల్ లో వున్న శంకరుడి మహత్యం వల్ల వచ్చిందంటారు. దాని మహిమ వల్ల ఏ టివి ప్రోగ్రాం చూసినా ఈయన జడ్జిగా మనని జడిపించేస్తున్నాడు.
ఏదో ఆయన ఖర్మ ఆయనది అనుకున్నా, నా బాధల్లా అసలు యంత్రుడు అంటే ఎవడు? అది అసలు తెలుగు పదమేనా? యంత్రానికి ,నాకు తెలిసి లింగాలుండవు.
ఇటువంటిదే మరొక్కటి ..అదేదో సినిమాలో డబ్బింగ్ రచయిత తన పైత్యం కలిపి మగధీరా అనే పదం సృష్టించి మనపై పడేశాడు. ఆదే పేరుతో రాజమౌళి ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశాడు. ఆయన తండ్రి గారు రచయిత కూడాను. అసలు విషయమేమిటంటే ధీర అంటే స్త్రీ. మగధీర అంటే? నావరకు నిజంగా ఆ హీరో మగధీర లాగే వుంటాడు. నిజంగా కావలంటే ఆ సినిమా కి మగధీరుడు అని టైటిల్ వుండడం కరక్ట్.ఏమి చేస్తాం !!!!!